
టాటూలతో క్యాన్సర్!
లండన్: టాటూల ద్వారా స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తున్నట్లు వెల్లడైంది. టాటూలు వేయించుకుంటున్నవారిలో 5 శాతం మంది చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారని అధ్యయనంలో తేలింది. టాటూలు ఎక్కువకాలం ఉండేందుకు చర్మంలోకి రసాయనాలను పంపుతారు. వీటివల్ల ఇన్ఫెక్షన్లు వస్తున్నట్లు గుర్తించారు.
టాటూల ద్వారా చర్మ క్యాన్సర్ వస్తుందన్న విషయంపై శాస్త్రవేత్తలు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. టాటూల ద్వారానే చర్మ క్యాన్సర్ వస్తుందనేందుకు ఆధారాలు లేవని, రాదనే విషయాన్నీ కొట్టిపారేయలేమని చెబుతున్నారు.