Rashmika Mandanna reveals the idea behind her tattoo 'Irreparable' - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: రష్మిక టాటూ అర్థమెంటో తెలుసా? దాని వెనక ఇంత స్టోరీ ఉందా!

Jan 16 2023 9:29 AM | Updated on Jan 16 2023 10:50 AM

Rashmika Mandanna About her Tattoo Idea Irreparable - Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో అలరిస్తుంది. విజయ్‌తో ఆమె నటించిన వారసుడు విడుదలై థియేటర్లో సందడి చేస్తుంది. అలాగే బాలీవుడ్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో నటించిన ‘మిషన్ మజ్ను’ నేరుగా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా రీసెంట్‌గా బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించిన ఆమె తన వ్యక్తిగత విషయాలతో, పలు ఆసక్తిర విషయాలను పంచుకుంది.

చదవండి: తండ్రి అయిన స్టార్‌ కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ

ఈ సందర్భంగా తన చేతిపై ఉన్న టాటూ గురించి యాంకర్‌ ఆరా తీసింది. ఈ నేపథ్యంలో తన టాటూ వెనక పెద్ద స్టోరీ ఉందంటూ అసలు విషయం బయటపెట్టింది రష్మిక. ‘మొదట నాకు అసలు టాటూ వేయించుకోవాలనే ఆలోచనే లేదు. మా కాలేజీలో ఉన్నప్పుడు మా క్లాస్‌ అబ్బాయి ‘ఆడపిల్లలు బాధను ఓర్చుకోలేరు. వాళ్లకు సూదులన్నా భయమే’ అన్నాడు. అది తప్పు అని నిరూపించాలనుకున్నా. అందుకే టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ ఏం వేయించుకోవాలో తెలియదు. చాలా సేపు ఆలోచించాను.

చదవండి: తండ్రి ఎమోషనల్‌.. ఇది నాకు అతిపెద్ద విజయం: డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి

అప్పుడే నాకు ఓ ఆలోచన వచ్చింది. ‘ఎవరూ, ఎవరిని భర్తీ చేయలేరనేది నా అభిప్రాయం. అలాగే ప్రతి ఒక్కరికి ఒక సొంత గుర్తింపు ఉంటుంది. ఎవరికి వారు స్పెషలే’ అని అనుకుంటాను. అదే అర్థం వచ్చేలా టాటూ వేయించుకోవాలి అనుకున్నా. అందుకే ఇర్‌రీప్లేసబుల్‌ (Irreplaceable) అనే పదాన్ని వేయించుకున్నా’’ అంటూ తన టాటూ వెనక ఉన్న రహస్యాన్ని చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం రష్మిక తెలుగులో పుష్ప 2, హిందీలో ఎనిమల్‌ చిత్రాలతో బిజీగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement