
టాటూ తెచ్చిన తంటా
ఒక్కోసారి మనకు ఇష్టం లేనివి, కష్టమైనవి చెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. నటి ఇలియానా ప్రస్తుతం ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ గోవా సుందరి కోలీవుడ్‌లో విజయ్ సరసన నన్బన్ చిత్రంలో నటించి అలరించారు. అయితే ప్రస్తుతం దక్షిణాది చిత్రాలకు దూరంగా బాలీవుడ్ చిత్రాలపైనే దృష్టిసారిస్తున్న ఈ బ్యూటీ అక్కడి సంస్కృతికి అలవాటు పడటానికి అవస్థలు పడుతున్నారు. పలువురు బాలీవుడ్ స్టార్స్ నుంచి అవమానం ఎదుర్కొన్నారు. ఆమెను అంతగా అప్‌సెట్‌కు గురి చేసిన విషయం ఏమిటంటే బాలీవుడ్ తారల్లో టాటూల సంస్కృతి అధికం అవుతోంది.
అక్కడ టాటూలు వేయించుకోని హీరో హీరోయిన్లు లేరనే చెప్పవచ్చు. అలాంటిది బాలీవుడ్‌లో వెలిగిపోవాలని తహతహలాడుతున్న ఇలియానాకు టాటూల మోహం లేదట. అయితే ఏ కార్యక్రమంలో కలిసినా సహ నటీనటులు టాటూ పొడిపించుకోలేదా అంటూ ఎగతాళి చేస్తున్నారట. వీరిపోరు పడలేక ఇలియానా తన పేరుతో కుడి చెయ్యిపై టాటూ పొడిపించుకున్నారట. అయినా సహ నటీనటులు ఒక్క టాటూనేనా అంటూ మళ్లీ పరిహాసం చేస్తుండడంతో అమ్మడు చాలా అప్‌సెట్ అయ్యారట. ప్రస్తుతం మంచి డిజైన్‌తో కూడిన టాటూ కోసం ఇలియానా అన్వేషిస్తున్నారట.