
ఇది నా ఫస్ట్ టాటూ అంటున్న హీరోయిన్
హైదరాబాద్: దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలలో తనకంటూ ఈ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో అమలాపాల్ ఒకరు. అయితే, ఆ ముద్దుగుమ్మ ఎంతో ఇష్టపడి ఓ టాటును వేయించుకుంది. తన కాలి పాదం పై భాగంలో బాణం లాంటి గుర్తును, ఓ చిన్న రింగు ఆకారాన్ని పచ్చబొట్టు పొడిపించుకుంటూ ఆ ఫొటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మై ఫస్ట్ టాటూ అంటూ రాసుకొచ్చింది. డ్రీమ్ క్యాచర్, ఫ్రీడమ్, శాంతి, లవర్ లైఫ్ అనే పదాలను యాష్ ట్యాగ్ జత చేస్తూ తన ట్విట్టర్ లో రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ పచ్చబొట్టు గురించి తెలిసిన ఆమె అభిమానులు ఆ టాటూ ఎంటో, ఎలా ఉందో అంటూ చూడాలని సోషల్ మీడియాలో వెతకడం మొదలెట్టారు.
సినిమా ప్రొఫెషన్ విషయానికొస్తే పెళ్లి తర్వాత అమలాపాల్ లో కనిపిస్తున్న మార్పును సులభంగానే గ్రహించవచ్చు. ఆమె కెరీర్ ను పెళ్లికి ముందు, ఆ తర్వాత అని చెప్పవచ్చు. పెళ్లికి ముందు అందరు హీరోయిన్ల మాదిరిగానే హీరోలతో లవ్, రొమాన్స్ పాత్రల్లో జాలీగా నటించేశారు. వివాహానంతరం సెలెక్టెడ్ చిత్రాలే చేస్తాను అని ప్రకటించిన అమలాపాల్ అదే విధంగా ఇప్పుడు పాత్రల ఎంపిక విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది.
#Throwback to my first tattoo #dreamcatcher #Freedom, #peace n #loveforlife. #Tattoo #GotInked #Hipster #Gypsysoul pic.twitter.com/V31v9Fi7Zv
— Amala (@Amala_ams) February 21, 2016