
దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార, కొరియోగ్రాఫర్, నటుడు, డ్యాన్సర్, దర్శకుడు ప్రభుదేవాల మధ్య చిగురించిన ప్రేమ ఎక్కువకాలం నిలవలేదు. అయితే వీరు గాఢంగా ప్రేమించుకుంటున్న సమయంలో నయన్ అతని పేరును పచ్చబొట్టు పొడిపించుకుంది. ప్రభుదేవా పేరుని సగం ఇంగ్లీషులో, మిగతా సగం తమిళంలో వేయించుకుంది. అయితే తర్వాత ఏమైందో కారీ ఈ ప్రేమపక్షులు విడిపోయారు. కానీ ఆ టాటూ మాత్రం అలాగే ఉండిపోయింది. అయితే నయన్ తాజాగా షేర్ చేసిన ఫొటో ద్వారా టాటూను మార్చివేసినట్లు తెలుస్తోంది. ప్రభుదేవాని కాస్తా రీడిజైన్ చేయించి పాజిటివిటీగా మార్చింది. (మళ్లీ ఒంటరైన నయన)
నయన్ తీసుకున్న అభిప్రాయం సరైనదని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో శింబుతో, తర్వాత ప్రభుదేవాతో.. ఇలా రెండుసార్లు ప్రేమ బెడిసికొట్టడంతో నయన్ మానసిక వేదనకు గురైంది. అనంతరం దాని నుంచి కోలుకుని సినిమాలపై దష్టి పెట్టిన ఈ హీరోయిన్ ప్రస్తుతం డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 2015 నుంచి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే రెండుసార్లులో ప్రేమలో విఫలమైన నయన్ ఈసారైనాపెళ్లివరకు వెళుతుందో లేదో చూడాలి. (నయన్ విషయంలోనూ అలాగే జరగనుందా?)
Comments
Please login to add a commentAdd a comment