పచ్చబొట్టు చెరిగిపోదా? | problems with the tattoos | Sakshi
Sakshi News home page

పచ్చబొట్టు చెరిగిపోదా?

Published Thu, Jul 3 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

పచ్చబొట్టు  చెరిగిపోదా?

పచ్చబొట్టు చెరిగిపోదా?

జీవితాంతం చెరిగిపోని విషయాలు, గుర్తులు చాలా ఉంటాయి. అలాంటివాటిలో ‘పచ్చబొట్టు’ ఒకటి. చెరిపేస్తే చెరిగిపోయే పచ్చబొట్టుతో సమస్య లేదు కానీ.. ఎటొచ్చీ చెరిగిపోని వాటితోనే సమస్యంతా. ఏదో ఒక మైకంలో వేయించుకునే ఆ పచ్చబొట్టుని వదిలించుకోవడానికి ఆ తర్వాత నానా తంటాలూ పడాల్సి వస్తుంది. రణబీర్ కపూర్‌తో ప్రేమలో ఉన్నప్పుడు ‘ఆర్‌కె’ అంటూ దీపికా పదుకొనే మెడ మీద ఓ పచ్చబొట్టు వేయించుకున్నారు. సినిమాల్లో నటించేటప్పుడు అది కనిపించకుండా మేకప్‌తో కవర్ చేస్తున్నారు.

ఆ పచ్చబొట్టుని వదిలించుకోవాలంటే లేజర్ చికిత్స చేయించుకోవాల్సిందేనట. ఇప్పుడు నయనతార సమస్య కూడా అదే. ప్రభుదేవాని ప్రేమించినప్పుడు ‘ప్రభు’ అంటూ చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారు. అతన్నుంచి విడిపోయి దాదాపు నాలుగేళ్లవుతున్నా ఆ పచ్చబొట్టు మాత్రం చేతి మీద అలానే ఉంది. నయన కని పించగానే చాలామంది చూపులు ఆ చేతి మీద పడటం, నయన ఇబ్బందిపడటం జరుగుతోంది. ఈ ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఆ పేరుని తొలగించాలని నిర్ణయించుకున్నారట. అయితే, అదంత సులువైన విషయం కాదు.

ఇలా చెరిపేస్తే అలా చెరిగిపోదట. శస్త్ర చికిత్స ద్వారానే అది సాధ్యపడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో లేజర్ చికిత్స ద్వారా ఆ పచ్చబొట్టుని వదిలించుకోవాలనుకుంటున్నారనే వార్త వినిపించింది. కానీ, నయనతార ఇంకా ఆ ప్రయత్నం చేసినట్లు లేదు. ఎందుకంటే, ఆర్య తమ్ముడు హీరోగా రూపొందిన ‘అమర కావ్యం’ ఆడియో వేడుకలో ఇటీవల నయనతార పాల్గొన్నారు. కురచ చేతులున్న పొట్టి గౌనులో ఆ వేడుకలో నయన మెరిపోయారు. అలాగే, ఆమె చేతి మీద ఉన్న పచ్చబొట్టు కూడా అందర్నీ ఆకర్షించింది. మరి.. ఈ పచ్చబొట్టు జీవితాంతం ఉంటుందా? లేక చెరిగిపోతుందా? అనేది కాలమే చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement