
శ్రీదేవి ముద్దుల తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ యూత్‌లో యమ క్రేజ్ సంపాదించుకుంది. ఏ ట్రిప్పుకు వెళ్లినా, ఏ ఫ్రెండ్‌తో కలిసి రచ్చ చేసినా, వర్కవుట్ చేసినా, వెరైటీ ఫొటోషూట్ చేసినా.. ప్రతీది అభిమానులతో షేర్ చేసుకోవడం ఆమెకు ఎంతో ఇష్టం. ఈ క్రమంలో జాన్వీ కపూర్ పచ్చబొట్టు వేయించుకున్న విషయాన్ని వెల్లడించి ఫ్యాన్స్‌కు స్వీట్ షాకిచ్చింది. ఈ మేరకు పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో టాటూ ఆర్టిస్ట్ ఆమె చేతికి ఐ లవ్ యూ మై లబ్బూ అని పచ్చబొట్టు వేశాడు. ఇది చూసిన అభిమానులు లబ్బూ ఎవరబ్బా? అని తెగ ఆలోచించారు. ఒకవేళ జాన్వీ ఎవరితోనైనా పీకల్లోతు ప్రేమలో ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ అలాంటిదేమీ లేదు.
శ్రీదేవి తన గారాలపట్టి అయిన జాన్వీని లబ్బూ అని పిలిచేది. ఈ క్రమంలో 'ఐ లవ్ యూ మై లబ్బూ.. నువ్వు ఈ ప్రపంచలోనే బెస్ట్ బేబీవి' అని శ్రీదేవి పేపర్ మీర రాసిచ్చిన వాక్యాల్లో నుంచి 'ఐ లవ్ యూ మై లబ్బూ 'అనే పదాలు ఎప్పటికీ చెక్కు చెదరకుండా తన చేతి మీద పర్మినెంట్ టాటూ వేయించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment