అమ్మ నన్ను తిట్టేది:జాన్వీ కపూర్‌ | Janhvi Kapoor Recalls Mom Sridevi Scolding Her in Telugu, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: అమ్మ నన్ను తిట్టేది: జాన్వీ

Published Sat, Jan 6 2024 10:36 AM | Last Updated on Sat, Jan 6 2024 12:22 PM

Janhvi Kapoor Recalls Mom Sridevi Scolding Her in Telugu, Video Goes Viral - Sakshi

దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోయేది.. పక్కింటి అమ్మాయిగా కనిపించేది, కల్మషం లేని నవ్వుతో కవ్వించేది.. అమ్మాయిలు అసూయ చెందేలా అందంతో అల్లాడించేది.. కంటిచూపుతో చంపడం, నవ్వుతుంటే ముత్యాలు రాలడం ఈమె విషయంలో నిజమయ్యేది.. ఆవిడే అందాల తార శ్రీదేవి. ఈమె తల్లిది తిరుపతి.. తండ్రిది తమిళనాడులోని శివకాశి. దీంతో చిన్నప్పటినుంచే తెలుగు, తమిళ భాషల్లో శ్రీదేవి అనర్గళంగా మాట్లాడేది. కాందన్‌ కరుణై అనే తమిళ చిత్రంతో ఈమె బాలనటిగా మారింది. మా నాన్న నిర్దోషి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

హీరోల కంటే ఎక్కువ పారితోషికం
తెలుగు, తమిళం, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో బాలనటిగా, హీరోయిన్‌గా మెప్పించింది. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, అంబరీష్‌, కృష్ణ, నందమూరి తారక రామారావు, నాగార్జున,  చిరంజీవి, వెంకటేశ్‌, అమితాబ్‌ బచ్చన్‌, జితేంద్ర, రాజేశ్‌ ఖన్నా, అనిల్‌ కపూర్‌.. ఇలా దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించింది. ఒకానొక దశలో హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది. 1996లో నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లాడింది. బోనీకి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ఈ జంటకు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌ సంతానం.

దొంగతనం చేసి దొరికిపోయేదాన్ని
జాన్వీ ఇప్పటికే హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించగా ఖుషీ ఈ మధ్యే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా జాన్వీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. నేను అమ్మ గదికి వెళ్లి తన లిప్‌స్టిక్‌లు దొంగిలించి జేబు నిండా నింపుకునేదాన్ని. అమ్మ నన్ను ఆపి నీ జేబు చూపించు అని అడిగేది. నేనేమో ఏమీ తెలియనట్లు జేబులో ఏం లేదమ్మా.. అని అబద్ధం చెప్పేదాన్ని. అప్పుడు అమ్మ.. నా కొడకా.. అని తిట్టేది. తను ఎప్పుడూ అలాగే తెలుగులో తిడుతూ ఉండేది అని చెప్పుకొచ్చింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఎంత క్యూట్‌గా తిట్టిందో అని కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా జాన్వీ.. దేవర సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయం కానుంది.

చదవండి: సామ్‌కు బాలీవుడ్‌లో ఆఫర్‌.. ఊ అంటుందా? ఉఊ అంటుందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement