
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. 'దఢక్' సినిమాతో హీరయిన్ అయిపోయింది. కానీ ఆ తర‍్వాత సరైన హిట్ ఒక్కటీ లేదు. అయితే కెరీర్ ప్రారంభంలోనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటించే ఛాన్స్ ఈమెకు దక్కింది. నటిగా పక్కనబెడితే గ్లామరస్ ఫొటోలతోనూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో గొడవలు మొదలుపెట్టిన శోభాశెట్టి!)
మరోవైపు బాయ్‌ఫ్రెండ్‌తోనూ షికారు చేస్తూ చాలాసార్లు కెమెరాకి చిక్కింది. అయితే ఈమెకు ఇదివరకే ఒక బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు. కాకపోతే అతడితో బ్రేకప్ అయ్యింది. దీని గురించి నటి జాన్వీ కపూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బయటపెట్టింది. తన ఫస్ట్ లవ్ కొన్ని రోజుల్లోనే ముగిసిపోయిందని చెబుతూ బాధపడింది.
'పరిణితి లేని వయసు కారణంగా ఇద్దరం ఓ రకమైన అయోమయానికి గురయ్యాం. దీంతో మా మధ్య ప్రేమలో నిజాయితీ లోపించింది. అబద్దాలతోనే మా లవ్, రిలేషన్ కొనసాగుతూ వచ్చింది. అదే సమయంలో నా తల్లిదండ్రులు చదువుపై దృష్టి పెట్టాలని గట్టిగా హెచ్చరించారు. వారి మాటలు వింటే భవిష్యత్తు బాగుంటుందని అర్థమైంది. దీంతో నా తొలిప్రేమకు ముగింపు పలికాను' అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ.. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర'లో హీరోయిన్‌గా చేస్తోంది.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో తొలిరోజే గొడవ? నామినేషన్లలో ఉన్నది వీళ్లే!)
Comments
Please login to add a commentAdd a comment