పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన పచ్చబొట్టు.! | Woman Beats Up Husband Over Tattoo of a Girl Name | Sakshi
Sakshi News home page

పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన పచ్చబొట్టు.!

Published Fri, Jul 20 2018 11:47 AM | Last Updated on Fri, Jul 20 2018 12:38 PM

Woman Beats Up Husband Over Tattoo of a Girl Name - Sakshi

సాక్షి, చెన్నై: ఇష్టమైన వారిని మెప్పించడం కోసం ఒక్కొక్కరు ఒక్క విధంగా ప్రయత్నిస్తుంటారు. కొంద మంది బహుమతులు ఇస్తే మరికొంత మంది తాము ఇష్టపడిన వారి పేర్లను పచ్చబొట్లు (టాటూ)ల కూడా వేయించుకుంటారు. అలా వేయించుకున్న ఓ పచ్చబొట్టే పచ్చని కాపురంలో చిచ్చురేపింది. గతంలో తను ప్రేమించిన అమ్మాయి పేరును పచ్చబొట్టు వేయించుకన్న వ్యక్తి.. కాలం కలిసి రాకపోవడంతో వేరే మహిళను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ పచ్చబొట్టు మాత్రం అలాగే చేతిపై ఉండిపోయింది. అనుకోకుండా భర్త చేతిపై వేరే మహిళ పేరు ఉండటంతో నవవధువుకు పట్టలేని కోపం వచ్చింది. అతడిని చితకబాదింది. ఈ ఘటన తమిళనాడులోని  కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళయంలో బుధవారం చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేట్‌ బస్సులో క్లీనర్‌గా పనిచేస్తున్న వ్యక్తి(20)కి, మహిళ(22)తో ఐదు రోజుల కిందట వివాహం​జరిగింది.  అయితే నవదంపతులు బుధవారం సాయంత్రం సాయిబాబ కాలనీలోని ఓ గుడికి వెళ్లారు. దర్శనం అనంతరం బస్టాండ్‌లో బస్సు కోసం వేచిచూస్తూ.. కబుర్లు చెప్పుకుంటూ నిల్చున్నారు. ఆ సమయంలో తన భర్త చేతిపై వేరే మహిళ పేరు ఉండటాన్ని గమనించి, ఆ పేరు ఎవరిదని ప్రశ్నించింది. అతడి నుంచి సమాధానం రాకపోవడంతో అందరూ చూస్తుండగానే చితకొట్టేసింది. చొక్కా పట్టుకొని చెంప చెళ్లుమనిపించింది. జుట్టు పట్టుకొని పిడిగుద్దులు గుద్దింది. కిందపడేసి చెడామడా వాయించింది. చుట్టూ ఉన్న జనం ఇదంతా చూసి షాకయ్యారు.అయినా ఆ పేరెవరిదో చెప్పకపోవడంతో ఆ నవవధువు తన పుట్టింటికి వెళ్లిపోయింది.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement