
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువతి ఆరు నెలలకే విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై పెరంబూర్ నీలం తోటకు చెందిన రామచంద్రన్ (21). ఇతను ఆరు నెలల ముందు కీర్తన (21)ను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కీర్తన చెన్నైలోని ఓ సూపర్ మార్కెట్‌లో పని చేస్తోంది. కొన్ని రోజులుగా రామచంద్రన్ పనికి వెళ్లకుండా సామాజిక సేవపై ఆసక్తి చూపినట్లు తెలిసింది.
దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో విరక్తి చెందిన కీర్తన శనివారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను రాజీవ్‌గాంధి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కీర్తన మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment