
టాటూలతో ఉద్యోగావకాశాలు!
లండన్: శరీరంపై పచ్చబొట్టు (టాటూ) ఉద్యోగార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గతంలో తేలినప్పటికీ తాజా అధ్యయనాల్లో మాత్రం ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వెల్లడైంది. నైట్‌క్లబ్‌లలో మద్యం అందించే ఉద్యోగానికి(బార్‌టెండర్) టాటూ ఉన్నవారినే బార్ మేనేజర్లు ఎక్కువగా ఎంపిక చేస్తున్నట్లు యూకేలోని సెయింట్ ఆండ్రూ వర్సిటీకి చెందిన ఆండ్రూ టిమ్మింగ్ పరిశోధనలో తేలింది.
యువ కస్టమర్లను టాటూలు ఆకర్షిస్తాయని, ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో టాటూలు మార్కెటింగ్, బ్రాండింగ్ సాధనాలుగా ఉపయోగపడుతున్నాయని టిమ్మింగ్ చెబుతున్నారు. పబ్‌మేనేజర్లను టాటూలపై ప్రశ్నించగా.. అవి సానుకూల ప్రభావం చూపుతాయని చెప్పారు. అయితే సాతానిజం, ఫాసిజం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే టాటూలు మాత్రం ప్రతికూల ప్రభావం చూపుతాయని బార్ యజమానులు చెబుతున్నారు.