కూతురిపై ప్రేమ: గిన్సిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం ఏం చేశాడో తెలుసా? | UK Man Creates World Record Gets 667 Tattoos Of Daughter Name | Sakshi
Sakshi News home page

కూతురిపై ప్రేమ: గిన్సిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం ఏం చేశాడో తెలుసా?

Published Tue, Sep 12 2023 9:43 PM | Last Updated on Tue, Sep 12 2023 9:57 PM

UK Man Creates World Record Gets 667 Tattoos Of Daughter Name - Sakshi

 Mark Owen Evans Record గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం కొంతమంది ఒక గోల్‌.  ఎవరూ చేయడానికి సాహసించని  పనులు , విన్యాసాలతో  తమ పేరును ప్రత్యేకంగా నిలుపుకోవాలని చూస్తాడు. అయితే ఇక్కడ  ఓ 49 ఏళ్ల వ్యక్తి వ్యక్తి తన గారాల పట్టి మీద ఉన్న ప్రేమను అనూహ్యంగా చాటుకున్నాడు.   యూ​ఏకి  చెందిన మార్క్ ఓవెన్ ఇవాన్స్ ఏకంగా తన ముద్దుల కుమార్తె పేరును శరీరంపై  667 సార్లు టాటూలా వేయించుకుని  పంచ రికార్డు సాధించాడు. ఇలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు  చేసుకోవడం ఇది రెండో సారికావడం విశేషం. అలా తన సొంత రికార్డును తానే అధిగమించాడు. 

2017లో తొలిసారిగా తన కూతురు పేరును తన వీపుపై 267 సార్లు టాటూ వేయించుకుని రికార్డు సృష్టించాడు. కానీ 2020లో అమెరికన్ డైడ్రా విజిల్ తన పేరు మీద 300 సార్లు టాటూ వేయించుకోవడం ద్వారా రికార్డును బద్దలు కొట్టడంతో ఎవాన్స్ ఆ రికార్డును కోల్పోయాడు. తాజాగా ఇవాన్స్ తన కూతురు పేరు 'లూసీ'పై 667 టాటూలు వేయించుకుని తన రికార్డును తానే బ్రేక్‌  చేయడమేకాదు తమ తండ్రీకూతుళ్లు  బంధం సాటిలేనిదని నిరూపించాడు.

ఇద్దరు టాటూ ఆర్టిస్టులు గంటపాటు శ్రమించి మొత్తం భాగాన్ని పూర్తి చేశారు. ఒక్కో కాలుపై 200, మొత్తం 400 టాటూలతోపాటు ఈ మొత్తం టాటూలు పూర్తి కావడానికి ఐదున్నర గంటలు పట్టిందని ఇవాన్స్ మీడియాకుతెలిపారు. ఇది విచిత్రంగా ఉన్నా.. రికార్డును తిరిగి దక్కించు కోవడం, దీన్ని తన  కుమార్తెకు అంకితం చేయడం సంతోషంగా ఉందంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement