అషూ పేరు పచ్చబొట్టు.. కంటతడి పెట్టుకున్న భామ | Viral: Ashu Reddy Die Hard Fan Tattooed Her Name, See Her Reaction | Sakshi
Sakshi News home page

అషూరెడ్డి పేరు పచ్చబొట్టు వేయించుకున్న వీరాభిమాని

Jun 25 2021 12:46 PM | Updated on Jun 25 2021 12:46 PM

Viral: Ashu Reddy Die Hard Fan Tattooed Her Name, See Her Reaction - Sakshi

అషూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆ టాటూపై స్పందించింది. "ఓ మై గాడ్‌.. థాంక్యూ సో మచ్‌.. నిజంగా నాకు ఆనందంతో..

జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డికి సోషల్‌ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువే. నిత్యం ఫొటోషూట్లతో, ఫన్నీ వీడియోలతో ఫ్యాన్స్‌ను అలరించే ఆమెను ఓ వీరాభిమాని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆమె మీద ప్రేమను వ్యక్తీకరిస్తూ ఏకంగా అషూ అని చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. దీని పక్కనే ఎర్ర గులాబీ పువ్వును కూడా ముద్రించుకున్నాడు.

ఇది చూసి షాకైన అషూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆ టాటూపై స్పందించింది. "ఓ మై గాడ్‌.. థాంక్యూ సో మచ్‌.. నిజంగా నాకు సంతోషంతో కన్నీళ్లొచ్చేస్తున్నాయి" అంటూ దండం పెడుతున్న ఎమోజీని జత చేసింది. కాగా అషూ ఈ మధ్యే వ్యాఖ్యాత అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. హోస్ట్‌గా మారడం గురించి ఆమె మాట్లాడుతూ.. ఎప్పటికైనా హోస్టింగ్‌ చేస్తాననుకున్నా, కానీ మరీ ఇంత త్వరగా హోస్ట్‌గా మారిపోతాననుకోలేదు' అని చెప్పుకొచ్చింది.

ఇదిలా వుంటే అషూ, రాహుల్‌ సిప్లిగంజ్‌ల మధ్య ఏదో ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తమ మధ్య స్నేహం మాత్రమే ఉందంటూ ఆ రూమర్లను కొట్టేపారేసింది ఈ జంట. కానీ ఈ మధ్యే రాహుల్‌.. సర్‌ప్రైజ్‌ అనౌన్స్‌మెంట్‌ అంటూ అషూను హత్తుకున్న ఫొటోను షేర్‌ చేసి దానికి లవ్‌ సింబల్‌ యాడ్‌ చేశాడు. దీంతో అది ప్రేమా? ఏదైనా ప్రమోషన్‌ స్టంటా? అని అభిమానులు తలలు పట్టుకున్నారు. ఇప్పటికీ ఆ పోస్టు మీద వారు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం.

చదవండి: బిగ్‌బాస్‌ కలిపిన ప్రేమ.. తోటి కంటెస్టెంట్‌తో లవ్‌

హ్యాండ్‌ బ్యాగ్‌కు రెండు లక్షలు! అషూ తల్లి ఫైర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement