సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ క్లిక్ అయింది అషూ రెడ్డి. జూనియర్ సమంతగా కుర్రకారు మనసు దోచుకుంది. తర్వాత బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టి తన అందంతో అందరినీ పడగొట్టేసింది. ఆ తర్వాత బుల్లితెరపై షోలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా పాపులర్ అయింది. ఇకపోతే సోషల్ మీడియాలో ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. పొట్టి బట్టలతో చిందులేస్తూ, పార్టీలు చేసుకుంటూ, ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది.
ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే అషూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అషూ చేతిలో మాన్షన్ హౌస్ వైన్ బాటిల్ ఉంది. అషూ తండ్రే స్వయంగా ఆ బహుమతి పంపించాడు. ఈ బహుమతి పంపించినందుకు తండ్రికి థ్యాంక్స్ చెప్పిన అషూ ఈ విషయం అమ్మకు తెలిస్తే అస్సలు సంతోషంగా ఉండదు అని రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment