
పచ్చబొట్టు చెరిగిపోవులే...
అరె... పోయిందే..! నేను చెప్పేది వినండి మేడం. నేను బ్రహ్మచారిని. నా వయసు నలభై నాలుగు. నేను అందంగా ఉంటానని చాలామందిలా మీరూ అన్నారు. పచ్చబొట్టు ఎప్పటికీ చెరిగిపోదనే సంగతి తెలిసిందే. ఆవేశంలోనో, అనాలోచితంగానో వేసుకున్న పచ్చబొట్టు కాలం తారుమారైనప్పుడు మాయని మచ్చగా మిగిలి మనుషులకు మనస్తాపం కలిగించే అనుభవాలూ తెలిసినవే. చర్మం లోలోతుల్లోకి ఇంకిపోయిన పచ్చబొట్టు సిరా మరకలను తొలగించాలంటే, ఇప్పటి వరకు శస్త్రచికిత్స, లేజర్ చికిత్సలు మాత్రమే అందుబాటులో ఉన్న మార్గాలు.
పచ్చబొట్టు పొడిపించుకునేటప్పటి నొప్పి కంటే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల ద్వారా దానిని తొలగించుకునేటప్పుడు మరింత నొప్పి అనుభవించాల్సి ఉంటుంది. వీటి వల్ల తలెత్తే దుష్ర్పభావాలూ ఎక్కువే. అయితే, పచ్చబొట్టును తేలికగా తొలగించగల క్రీమ్‌కు బ్రిటిష్ పరిశోధకుడు ఒకరు రూపకల్పన చేశాడు. హాలిఫాక్స్‌లోని డల్హౌసీ వర్సిటీ పాథాలజీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్న అలెక్ ఫాల్కెన్‌హామ్ రూపొందించిన ఈ క్రీమ్ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తే, ఎలాంటి నొప్పి లేకుండానే పచ్చబొట్లను తొలగించుకోవడం తేలికవుతుంది.