
తాప్సీ టాట్టుకు పిచ్చ క్రేజ్
సినిమా, అందులో నటించే తారల ప్రభావం యువతపై ఎంతగా పడుతుందో అనడానికి చిన్న ఉదాహ రణ నటి తాప్సీ వంటిపై పొడిపించుకున్న టాట్టు. నటి తాప్సీ ఇప్పుడు యమ ఖుషీగా ఉన్నారు. ఈ ముద్దుగుమ్మకు దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించినా లభించని విజయం బాలీవుడ్‌లో దక్కింది. నిజం చెప్పాలంటే తాప్సీ సాహసోపేతమైన పాత్రలో నటించి సక్సెస్ అయ్యార ని చెప్పవచ్చు. తను బిగ్‌బీ అమితాబ్‌తో కలిసి నటించిన చిత్రం పింక్.
ఇందులో అత్యాచారానికి గురైన యువతిగా తాప్సీ నటించారు. ఇందులో అమితాబ్ బచ్చన్‌కు ఎంత పేరు వచ్చిందో అంతగా తాప్సీ నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. గత 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చిన పింక్ చిత్రం ఇప్పటికే రూ. 72.44 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. త్వరలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరుతుందని కూడా అంచనాలు వేస్తున్నారు.ఈ చిత్రం కోసం నటి తాప్సీ మెడ కింద భాగంలో పక్షులు రెక్కలు విప్పి విహంగం చేసేలాంటి టాట్టును పొడిపించుకున్నారు.
ఇది ఆమె పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తుంది. టాప్సీ టాట్టు బాహ్యప్రంచంలో యువతను విపరీతంగా ఆకర్శించేస్తోందట. ఆమెలా టాట్టు పొడిపించుకోవడానికి యువతులు టాట్టు దుకాణాల్లో బారులు తీరుతున్నారట. మెడ కింద టాట్టు పొడిపించుకోవడానికి చాల బాధగా ఉంటుంది. అయినా పర్వాలేదని అక్కడే టాట్టు కావాలంటున్నారట. నటి తాప్సీ టాట్టు యువతలో ఎంత పిచ్చిగా ప్రభావం చూపుతుందో చూశారా’