సౌత్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఢిల్లీ భామ తాప్సీ తరువాత బాలీవుడ్‌లోనూ సత్తా చాటారు. బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామ మరో గోల్డెన్ చాన్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల జుడ్వా 2తో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న తాప్సీ బేబి, నాహ్ షబానా లాంటి సినిమాలతో నటిగానూ పేరు తెచ్చుకున్నారు. పింక్ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన తాప్సీ మరోసారి ఆ లెజెండరీ నటుడితో కలిసి నటించే చాన్స్‌కొట్టేశారు.
స్పానిష్ సినిమా ద ఇన్విజిబుల్ ఘోస్ట్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న బాలీవుడ్ లో మూవీతో అమితాబ్, తాప్సీలు కలిసి నటించనున్నారు. ఈచిత్రానికి సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించనున్నారు. తాను అమితాబ్ తో మరోసారి కలిసి నటించనున్న విషయాన్ని తాప్సీ ప్రకటించారు. ‘ప్రతీ భారతీయ నటుడు అమితాబ్ తో ఒక్కసారైనా కలిసి నటించాలని కోరుకుంటారు కానీ నాకు ఆ అవకాశం రెండోసారి కూడా వచ్చింది’ అన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ నాలుగు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment