
చైతూ, సమంతలు మళ్లీ దొరికేశారా..?
కొంత కాలంగా టాలీవుడ్ యువ జంట నాగచైతన్య, సమంత ల గురించి రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారంటూ, ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ వీరి వివాహానికి అంగీకరించిందంటూ ప్రచారం జరిగింది. అయితే అధికారికంగా చైతూ పెళ్లి చేసుకోబోయేది సమంతనే అన్న ప్రకటన మాత్రం రాలేదు. అదే సమయంలో నాగచైతన్య సమంతతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా మరో సంఘటన ఈ ఇద్దరి బంధం గురించి వస్తున్న వార్తలకు ఊతమిస్తోంది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సమంత తన చేతి మీద ఉన్న టాటూ కనిపించేలా ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. ఇప్పుడు ఆ టాటూనే హాట్ టాపిక్గా మారింది. సమంత కుడి చేతి మీద ఉన్న అదే తరహా టాటూ సరిగ్గా అదే ప్లేస్లో నాగచైతన్య చేతిమీద కూడా ఉండటం విశేషం. ఇద్దరూ కావాలనే అలా వేయించుకున్నారా.. లేక అనుకోకుండా అలా జరిగిందా.. ఏదైనా అక్కినేని ఫ్యామిలీ నోరు విప్పితే గాని అసలు విషయం బయటకి రాదు.