‘కేజ్రీవాల్‌ ఆరోగ్యం క్షీణిస్తోంది.. జైలులో 4.5 కేజీల బరువు తగ్గారు’ | AAP Says Arvind Kejriwal Unwell Lost 4.5 Kg In Tihar Jail Since Arrest- Sakshi
Sakshi News home page

Arvind Kejriwal Health: ‘కేజ్రీవాల్‌ ఆరోగ్యం క్షీణిస్తోంది.. జైలులో 4.5 కేజీల బరువు తగ్గారు’

Published Wed, Apr 3 2024 11:38 AM | Last Updated on Wed, Apr 3 2024 12:53 PM

AAP Says Arvind Kejriwal Unwell Lost 4.5 Kg Tihar jail - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌ అభియోగాలు  ఎదుర్కొంటున్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీ (రిమాండ్‌ ఖైదీ)లో భాగంగా తీహార్‌ జైల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ క్రమంలో తిహార్‌ జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్‌ ఆరోగ్యం సరిగా లేదని జలవనరుల శాఖ మంత్రి ఆతీశీ అన్నారు. ఆయన అస్వస్థతకు గురయ్యారని.. మార్చి 21న సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 4.5 కిలోల బరువు తగ్గారని ‘ఎక్స్‌ ’వేదికగా ఆమె తెలిపారు.

‘సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రమైన మధుమేహం (డయాబెటిక్స్‌) కలిగి ఉన్నారు. ఆరోగ్య సమ్యలు ఉ‍న్నపటికీ ఆయన దేశం కోసం రోజంతా పని చేస్తున్నారు. అరెస్ట్‌ అయిన దగ్గరి నుంచి కేజ్రీవాల్‌ 4.5 కిలోల బరువు తగ్గారు. ఇది చాలా బాధ కలిగించే విషయం. బీజేపీ కావాలని కేజ్రీవాల్‌ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది. కేజ్రీవాల్‌కు ఏమైనా అయితే దేశమే కాదు.. భగవంతుడు కూడా క్షమించడు’అని మంత్రి ఆతీశీ ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే తీహార్‌ జైలు అధికారు ఆతీశీ మాటలపై స్పందిస్తూ.. కేజ్రీవాల్‌ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. రెండు రోజు క్రితం ఆయన తీహార్‌ జైలుకు వచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్‌ బరువు తగ్గలేదని  చెప్పారు. అత్యంత భద్రత గల జైలు గదిలో ఆయన్ను ఉంచినట్లు తెలిపారు. అదేవిధంగా కేజ్రీవాల్‌ 55 కేజీల బరువు ఉన్నారు. ఆయన బరువులో ఎలాంటి మార్పు లేదు. ఆయన షుగర్‌ లెవల్స్‌ కుడా నార్మల్‌గానే ఉన్నాయని జైలు అధికారులు తెలిపారు. ఉదయం కేజ్రీవాల్‌ యోగా, మెడిటేషన్‌ చేస్తున్నారని అ‍న్నారు. ఆయకు కేటాయించిన సెల్‌లో కేజ్రీవాల్‌ నడుస్తున్నారని చెప్పారు.

ఇక..ఈడీ కస్టీడీ ముగిసిన అనంతరం అరవింద్‌ కేజీవాల్‌ను సోమవారం జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా తీహార్‌ జైలు పంపిన విషయం తెలిసిందే.  ఆయన జ్యుడీషియల్‌ కస్టడీ ఏప్రిల్‌ 15ను వరకు కొనసాగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement