ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంత బెయిల్ గడువు ఎల్లుండి (ఆదివారం)తో ముగుస్తుంది. ఆరోజే కేజ్రీవాల్ తిరిగి తీహార్ జైలులో లొంగిపోనున్నారు.సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో తాను లొంగిపోతున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రజలకు తెలియజేశారు.ఈ క్రమంలో తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొగసాగుతుందని కేజ్రీవాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
‘‘ లోక్ సభ ఎన్నికల కోసం సుప్రీంకోర్టు నాకు 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రేపటికి 21 రోజులు పూర్తవుతుంది. ఎల్లుండి నేను తీహార్ జైలులో లొంగిపోతున్నా. ఈసారి నన్ను ఎన్ని రోజులు ఎప్పటి వరకు జైల్లో ఉంచుతారో తెలీదు. దేశాన్ని నిరకుశత్వం నుంచి బయటకు తీసుకెళ్ళేందుకు జైలుకి వెళ్తున్నాను. నన్ను మాట్లాడనియకుండా భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. నేను జైలులో ఉన్నప్పుడు నాకు మందులు ఇవ్వలేదు.
मुझे परसों सरेंडर करना है। माननीय सुप्रीम कोर्ट का बहुत-बहुत शुक्रिया। https://t.co/1uaCMKWFhV
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 31, 2024
నేను 20 ఏళ్లుగా డయాబెటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. గడిచిన 10 ఏళ్లుగా నేను ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటున్నా. రోజు నా పొట్ట భాగంలో 4 సార్లు ఇంజక్షన్ తీసుకుంటాను. జైల్లో నాకు ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవ్వలేదు. నా షుగర్ లెవల్స్ 300-325 వరకు వెళ్లాయి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే కిడ్నీ, లివర్ దెబ్బతింటాయి. వీళ్లు ఏం కోరుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. జైల్లో 50 రోజులు ఉన్నాను. ఆరు కేజీల బరువు తగ్గాను. జైలుకు వెళ్ళినపుడు 70 కేజీల ఉన్నాను. ఇప్పుడు 64 కేజీలు ఉన్నాను. మళ్ళీ బరువు పెరగడం లేదు. శరీరంలో ఇతర వైద్య సమస్యలు ఉండొచ్చు. పరీక్షలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. యూరిన్‌లో కీటోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయి.
ఎల్లుండి మూడు గంటలకు నేను తీహార్ జైలులో లొంగిపోతాను. నేను దేనికి వెనక్కి తగ్గను. ఢిల్లీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జైలులో నా చింత అంతా ఢిల్లీ ప్రజల గురించే. ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉంటే కేజ్రీవాల్ సంతోషంగా ఉంటాడు. నేను మీ మధ్య లేకపోయినా ఢిల్లీ ప్రజల అన్ని పనులు జరుగుతాయి. జైలులో లోపల ఉన్నా బయట ఉన్నా ఢిల్లీ ప్రజల పనులు ఆగవు.
ఉచిత విద్యుత్, మోహల్లా క్లినిక్, హాస్పిటళ్లలో వైద్యం, ఉచితంగా మందులు, మహిళలకు ఉచిత బస్సు సర్వీస్, 24 గంటల కరెంట్ సహా త్వరలో మహిళలకు రూ. వెయ్యి ఆర్థిక సహకారం కొసాగుతుంది. ఢిల్లీ ప్రజల కుటుంబ సభ్యుడిలా నా బాధ్యత నెరవేర్చా. నా తల్లిదండ్రుల కోసం దేవుడిని ప్రార్ధించండి. వారి ఆరోగ్యం బాగాలేదు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాలి ’’ అని కేజ్రీవాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment