న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్నారు. అక్రమంగా ఆయన్ను అరెస్ట్ చేశారంటూ ఆప్ కార్యకర్తలు నిరసనకు దిగారు. మరోవైపు.. అరవింద్ కేజీవ్రాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
Delhi Police allows BJP's Protest, yet the same Delhi Police is pulling apart the turban of AAP Cabinet Minister @harjotbains@ECISVEEP, Delhi Police is under your supervision after declaration of Model Code of Conduct for General Elections.
— Dr Ranjan (@AAPforNewIndia) March 26, 2024
Free & Fair Elections...!? 🤡🤡🤡 pic.twitter.com/bI5mNPFPcP
అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన ఆప్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని పలు పోలీసు స్టేషన్లకు తరలించారు. ప్రధానిమోదీ నివాసం ముందు ఆమ్ ఆద్మీ పార్టీ గేరావ్ చేపట్టగా.. బీజేపీ కేజ్రీవాల్ రాజీనామాను డిమాండ్ చేస్తూ.. మెగా మార్చ్‌ను చేపట్టింది. జైలు నుంచి పాలన కొనసాగిస్తాననటం సిగ్గుచేటని బీజేపీ మండిపడుతోంది. బీజేపీ ఫిరోజ్ షా కోట్ల స్టేడియం నుంచి ఢిల్లీ సెక్రటేరియట్ వైపు మార్చ్ చేపట్టింది. కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
Massive protest at Patel chowk metro station by AAP Volunteers pic.twitter.com/4RndrfoRhM
— Jitender Singh (@jitenderkhalsa) March 26, 2024
చదవండి: కేజ్రీవాల్ రెండో ఆదేశం.. ఈడీ సీరియస్
ఆప్ కార్యకర్తలకు నిరసన తెలపడానికి అనుమతి లేదని పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులను అడ్డుకుంటున్నారు. ‘ఆప్ కార్యకర్తలు నిరసనలు చేయటానికి అనుమతి లేదు. పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద నిరసనకారులు పెద్ద ఎత్తున తరలివస్తారని మాకు సమాచారం ఉంది. అందుకే మేము భద్రతా చర్యలు చేపట్టాము’ అని ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ దేవేశ్ కుమార్ తెలిపారు.
BJP can protest when section 144 is imposed.
— Analyst 🕵🏽 (@bharat_builder) March 26, 2024
Delhi police have no problem with it.
But AAP cannot protest.
Dictatorship 101pic.twitter.com/xFlcdGl40F
Comments
Please login to add a commentAdd a comment