ఇటివల కాలంలో ఆహారంపై స్ప్రుహ బాగా పెరిగింది. అందులోనూ శాకాహారమే మంచిందటూ వీగన్ డైట్ ఫాలో అవ్వుతున్నారు. ఇలా కేవలం శాకాహారం మాత్రమే తీసుకున్న సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా అందరిలోనూ ఉండదని అన్నారు. ప్రోటీన్ డెఫిషయన్సీతో బాధపడేవారు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటే..?
- కేవలం కూరగాయలు మాత్రమే తీసుకున్నా అనేక విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. అయితే ఎక్కువ కేలరీలు పొందడం కష్టం. కేలరీల కొరత మన శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఎక్కవ కేలరీల కోసం పౌష్టికాహారంపై దృష్టి పెట్టక తప్పదు.
- ఇలా శాకాహారమే తినేవారు ముఖ్యంగా ప్రోటీన్ లోపం అనే మరో సమస్యను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఎందుకంటే? మాంసం ప్రోటీన్లకు నిలయం. అయితే శాకాహారులు కూరగాయల్లో కూడా ప్రోటీన్‌లతో కూడిన ఉంటాయి. వాటిని ఎంచుకుని తినడం అనేది అత్యంత ముఖ్యం.
- కేవలం కూరగాయలే తినడం వల్ల పీచుపదార్థం అధికమై గ్యాస్ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది అందర్నీ ప్రభావితం చేసే సమస్య కాదు. కొందరిలో మాత్రం ఈ సమస్య ఎక్కువగా ఉండొచ్చు.
- అలాగా శాకాహారులు ప్రోటీన్ల కోసం సోయా ఉత్పత్తులపై దృష్టి పెట్టడంతో హార్మోన్ల మార్పులకు దారితీసి లేనిపోని సమస్యలు తలెత్తవచ్చు.
- కొంతమంది శాకాహారులలో పోషకాహార లోపం డిప్రెషన్‌కు దారితీస్తుంది.
- అలాగే వీళ్లు ఎక్కువగా రక్తహీనతను ఎదర్కొంటారు. దీంతో గాయాల బారిన పడ్డ, అధికస్రావం అయినా, వారికి ప్రాణాంతకంగా మారిపోతుంది. అందువల్ల శాకాహారులు కేవలం కూరగాయలు తినేటప్పుడూ శరీరానికి సముతుల్యమైన రీతిలో కావాల్సిన పోషకాలు అందుతున్నాయో లేదో గమనించి తీసుకోవాలి. అలాగే న్యూట్రిషియన్ల సాయంతో శరీరానికి సరిపడే ప్రోటీన్లు అందేలా చూసుకోవాల్సి ఉంటుంది.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చింది. వ్యక్తిగత వైద్యులు లేదా న్యూటిషియన్లను సంప్రదించి పూర్తి స్థాయిలో తెలుసుకుని అప్పుడు జాగ్రత్తలు
తీసుకోవడం మంచిది.
(చదవండి: ఫ్రిజ్‌లో పెట్టిన కర్రీ తింటే డేంజరా? ఎన్ని రోజుల ఉంచితే బెటర్..?)
Comments
Please login to add a commentAdd a comment