బెంగళూరు టెకీ ఆత్మహత్మ, భరణం కేసు ప్రకంపనలు రేపుతున్న తరుణంలో మరో ఆసక్తికరమైన విడాకుల కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన 70 ఏళ్ల రైతు ఒకటీ రెండూ కాదు, ఏకంగా 18 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి, కోట్ల రూపాయల భరణం చెల్లించిన ఉదంతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అదీ పెళ్లి అయిన 44 ఏళ్ల తరువాత పట్టువీడకుండా, శాశ్వత భరణంగా రూ.3.01 కోట్లు చెల్లించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
వివరాలు ఇలా ఉన్నాయి...
హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన సుభాష్ చంద్ 1980, ఆగస్టు 27వ తేదీన సంతోష్ కుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఉన్నన్ని రోజులు వీరి సంసారం సజావుగానే సాగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అంతా బావుంది అనుకుంటున్న క్రమంలో ఈ జంట మధ్య విభేదాలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలివానలా మారాయి. దీంతో 2006, మే 8వ తేదీ నుంచి విడిగా జీవించడం ప్రారంభించారు. భార్యనుంచి విడాకులు ఇప్పించాల్సిందిగా 2006లొనే కోర్టును ఆశ్రయించాడు. అయితే కర్నాల్ కోర్టు 2013 జనవరిలో అతని విడాకుల అభ్యర్థనను తిరస్కరించింది. అయినా పట్టువీడని సుభాష్ హైకోర్టులో అప్పీల్ చేశాడు.
దాదాపు 11 సంవత్సరాల తరువాత రాజీ చేసుకోవాల్సిందిగా కోరిన హైకోర్టు, ఈ ఏడాది నవంబర్ 4వ తేదీన ఈ విషయాన్ని మధ్యవర్తిత్వం మరియు రాజీ కేంద్రానికి సూచించింది. ఈ ప్రక్రియలో భాగంగానే వీరికి మంజూరైనాయి. అయితే భార్యకు శాశ్వత భరణంగా మొత్తం 3.07 కోట్ల రూపాయలను చెల్లించేందుకు అంగీకరించాడు సుభాష్. దీనికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు కూడా అంగీకరించారు. అయితే ఈ భరణం ఎలా చెల్లించాడు అనేదే హాట్ టాపిక్
అంత భరణం ఎలా?
తన వ్యవసాయ భూమిని అమ్మి మరీ డిమాండ్ డ్రాఫ్ట్‌గా 2 కోట్ల 16 లక్షల రూపాయలను చెల్లించాడు. పంట అమ్మగా వచ్చిన సొమ్ముతో 50 లక్షల నగదు చెల్లించాడు. ఇక మిగిలిన 40 లక్షల రూపాయలను బంగారు, వెండి రూపంలో చెల్లించాడు. ముదిమి వయసులో , 18 ఏళ్ల సుదీర్ఘం న్యాయ పోరాటం తరువాత 44 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి పలకడం చర్చకు దారి తీసింది.
ఒప్పందం ప్రకారం చంద్‌కు చెందిన ఆస్తిపై భార్యాపిల్లలు అన్ని హక్కులను వదులు కున్నారని చంద్‌కు చెందిన రాజిందర్ గోయెల్ పేర్కొన్నారు. ఈ పరస్పర నిర్ణయాన్ని కోర్టు అంగీకరించి గత వారం విడాకులు ఖరారు చేసిందని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment