![Members of SINDA And Telangana Cultural Society Distributed Diwali Gifts - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/12/sind.jpg.webp?itok=wEl0kxi6)
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులు సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ (సిండా) తరపున దీపావళి గూడీ బ్యాగ్లను సింగపూర్లో పంపిణీ చేయడం జరిగింది. భారత దేశ మూలాలు ఉన్న ఆర్థికంగా వెనుకబడిన సింగపూర్ పౌరులకు సిండా వారు ప్రతీ సంవత్సరం దీపావళి పండుగ జరుపుకోవడానికి సహాయం చేస్తుంది. ఇందులో బాగంగా ఈ ఏడాది దీపావళి అలంకరణకు సంబందించిన సామాగ్రి తో పాటు కొన్ని తినుబండారాలు 120 డాలర్లు పండుగ ఖర్చుల నిమిత్తం అందజేసింది.
అయితే సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ (సిండా) పిలుపు మేరకు ఈ సంవత్సరం ఒక వారం రోజుల పాటు, 05 నవంబర్ నుండి 11 నవంబర్ వరకు దీపావళి సామాగ్రిని పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులను సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు అభినందించారు.
ఈ కార్యక్రమం లో స్వచ్ఛదంగా పాల్గొన్న సొసైటీ అధ్యక్షులు గడప రమేశ్ బాబు, ఇతర సభ్యులు రావుల సుగుణాకర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంగళ విజయ మోహన్, పలిక ప్రణీష్, పెరుకు శివ రామ్ ప్రసాద్ మరియు ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్ మొదలగు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలుడు గడప కౌశల్ చంద్ర ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో అభినందించదగిన విషయం అని సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు అన్నారు.
(చదవండి: ఫైర్ డిటెక్షన్ పరికరాన్ని కనిపెట్టిన భారత సంతతి విద్యార్థి!)
Comments
Please login to add a commentAdd a comment