సింగపూర్‌లో అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 17న ప్రపంచ వలసదారుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది వలసదారుల మధ్య ఉండే సహకార సంబంధానికి ప్రతీకగా, వారి హక్కులు, శ్రేయస్సు కోసం నిలబడే రోజుగా పరిగణిస్తారు. సురక్షిత వలసలను ప్రోత్సహించడం అనే థీమ్‌తో ఈ ఏడాది వలసదారుల దినోత్సవాన్ని జరుపుకున్నారు.
దీని ప్రకారం.. వలసదారులు, స్థానభ్రంశం చెందిన వ్యక్తులకు ఎదురయ్యే సవాళ్లను, మినహాయింపులను నొక్కి చెబుతుంది. శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్, తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ సంస్థలు సంయుక్తంగా వలస దారుల దినోత్సవం 2023లో భాగమయ్యారు. ఈ కార్యక్రమంలో వందలాది కార్మిక సోదరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా చిత్రలేఖనం పోటీ నిర్వహించి 25మంది విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తెలంగాణ స్పెషల్ సకినాలను అందరికి అందించారు. కార్యక్రమంలో ఉత్సాహంగా భాగస్వాములు అయిన శ్రీ సాంస్కృతిక కళాసారథి,తెలంగాణ కల్చరల్ సొసైటీ సంస్థలను సింగపూర్ ప్రభుత్వ మానవ వనరుల శాఖ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment