శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో లెర్న్ చెస్ అకాడెమీ వార్షిక చెస్ టోర్నమెంట్ | Learn Chess Academy Annual Chess Tournament 2024 to promote young talent in Singapore | Sakshi
Sakshi News home page

శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో లెర్న్ చెస్ అకాడెమీ వార్షిక చెస్ టోర్నమెంట్

Published Wed, May 8 2024 10:19 AM | Last Updated on Wed, May 8 2024 10:26 AM

 Learn Chess Academy Annual Chess Tournament 2024 to promote young talent in Singapore

సింగపూర్లో యువ ప్రతిభను ప్రోత్సహించే లెర్న్ చెస్ అకాడెమీ వార్షిక చెస్ టోర్నమెంట్ 2024 .

సింగపూర్‌లో ప్రముఖ చెస్ శిక్షణ సంస్థ అయిన “లెర్న్ చెస్ అకాడమీ”(Learn Chess Academy) మే 1వ తేదీన వార్షిక చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా యువ చెస్ ప్రతిభను పెంపొందించే ప్రయత్నం చేసారు. ఈ టోర్నమెంట్‌లో 6 నుండి 15 సంవత్సరాల వయస్కులైన సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు.  అండర్ 6, 8, 10, 12 ,13 ఏళ్ల పైబడినవారు ఇలా  ఐదు విభాగాలలో పోటీపడ్డారు

అపార అనుభవం కలిగిన ప్రొఫెషనల్ చెస్ కోచ్ మురళి కృష్ణ చిత్రాద స్థాపించిన ఈ  “లెర్న్ చెస్ అకాడమీ”, 15 సంవత్సరాల నుండి నిరంతరంగా చిన్న పిల్లలకు మరియు యువకులకు చదరంగం ఆటలో శిక్షణ ఇస్తోంది. ఈ టోర్నమెంట్ కేవలం పోటీకి మాత్రమే కాకుండా, విద్యార్థులు తమ వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రదర్శించే వేదికగా కూడా నిలిచింది.



ఈ కార్యక్రమం బహుమతి పంపిణీ కార్యక్రమంలో, టాటా ఇంటర్నేషనల్ సింగపూర్ ఛైర్మన్ , ఏసియన్ ఫార్మర్ రెసిడెంట్ డైరెక్టర్, ది సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ (SINDA) టర్మ్ ట్రస్టీ, సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (SIFAS) అధ్యక్షుడు,  అయిన కె.వి.రావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా అనుజ్ ఖన్నా సోహమ్, AFFLE గ్రూప్ వ్యవస్థాపకుడు పాల్గొన్నారు.

విద్యార్థుల విభిన్న ప్రతిభాపాటవాల ప్రదర్శనతో పాటు, వివిధ వినోదాత్మక కార్యక్రమాలతో, ఉత్సాహంగా జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు చెస్ థీమ్ స్కిట్, రూబిక్స్ క్యూబ్ సొల్యూషన్‌ లాంటి, టాలెంట్ షో, ప్రత్యేకమైన క్యాలెండర్ గేమ్ , క్విజ్‌  ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.

యువతలో సమస్యా పరిష్కార నైపుణ్యాలను, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు అభివృద్ధి చేయడంలో చెస్ ప్రాముఖ్యతను  మురళి కృష్ణ చిత్రాడ వివరించారు. "సౌందర్య కనగాల" యాంకరింగ్‌ ఆకట్టుకుంది.

శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ నాగేష్ మరియు గోపి చిరుమామిళ్ల  తదితర ప్రముఖులు విజేతలకు బహుమతులు అందజేసారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement