chess academy
-
అర్జున్‌కు తొమ్మిదో స్థానం..!
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. బర్దియా దానేశ్వర్ (ఇరాన్)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను అర్జున్ 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.అర్జున్‌తోపాటు మరో ఏడుగురు 6 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా.. అర్జున్‌కు తొమ్మిదో స్థానం ఖరారైంది. షంక్‌లాండ్ (అమెరికా), వొఖిదోవ్ (ఉజ్బెకిస్తాన్), బర్దియా, ముర్జిన్ (రష్యా) 6.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.ఇవి చదవండి: వింబుల్డన్ మెయిన్ ‘డ్రా’లో సుమిత్ నగాల్.. -
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో లెర్న్ చెస్ అకాడెమీ వార్షిక చెస్ టోర్నమెంట్
సింగపూర్‌లో ప్రముఖ చెస్ శిక్షణ సంస్థ అయిన “లెర్న్ చెస్ అకాడమీ”(Learn Chess Academy) మే 1వ తేదీన వార్షిక చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా యువ చెస్ ప్రతిభను పెంపొందించే ప్రయత్నం చేసారు. ఈ టోర్నమెంట్లో 6 నుండి 15 సంవత్సరాల వయస్కులైన సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 6, 8, 10, 12 ,13 ఏళ్ల పైబడినవారు ఇలా ఐదు విభాగాలలో పోటీపడ్డారుఅపార అనుభవం కలిగిన ప్రొఫెషనల్ చెస్ కోచ్ మురళి కృష్ణ చిత్రాద స్థాపించిన ఈ “లెర్న్ చెస్ అకాడమీ”, 15 సంవత్సరాల నుండి నిరంతరంగా చిన్న పిల్లలకు మరియు యువకులకు చదరంగం ఆటలో శిక్షణ ఇస్తోంది. ఈ టోర్నమెంట్ కేవలం పోటీకి మాత్రమే కాకుండా, విద్యార్థులు తమ వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రదర్శించే వేదికగా కూడా నిలిచింది.ఈ కార్యక్రమం బహుమతి పంపిణీ కార్యక్రమంలో, టాటా ఇంటర్నేషనల్ సింగపూర్ ఛైర్మన్ , ఏసియన్ ఫార్మర్ రెసిడెంట్ డైరెక్టర్, ది సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ (SINDA) టర్మ్ ట్రస్టీ, సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (SIFAS) అధ్యక్షుడు, అయిన కె.వి.రావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా అనుజ్ ఖన్నా సోహమ్, AFFLE గ్రూప్ వ్యవస్థాపకుడు పాల్గొన్నారు.విద్యార్థుల విభిన్న ప్రతిభాపాటవాల ప్రదర్శనతో పాటు, వివిధ వినోదాత్మక కార్యక్రమాలతో, ఉత్సాహంగా జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు చెస్ థీమ్ స్కిట్, రూబిక్స్ క్యూబ్ సొల్యూషన్ లాంటి, టాలెంట్ షో, ప్రత్యేకమైన క్యాలెండర్ గేమ్ , క్విజ్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.యువతలో సమస్యా పరిష్కార నైపుణ్యాలను, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు అభివృద్ధి చేయడంలో చెస్ ప్రాముఖ్యతను మురళి కృష్ణ చిత్రాడ వివరించారు. "సౌందర్య కనగాల" యాంకరింగ్ ఆకట్టుకుంది.శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ నాగేష్ మరియు గోపి చిరుమామిళ్ల తదితర ప్రముఖులు విజేతలకు బహుమతులు అందజేసారు. -
6లో హంపి... 11లో హారిక
హెంగ్షుయె (చైనా): వరల్డ్ మాస్టర్స్ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. 16 మంది మేటి చెస్ క్రీడాకారిణుల మధ్య ర్యాపిడ్ పద్ధతిలో 11 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం నాలుగు రౌండ్ గేమ్‌లు నిర్వహించారు. నాలుగో రౌండ్ ముగిశాక హంపి రెండు పాయింట్లతో ఆరో స్థానంలో, హారిక రెండు పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నారు. తొలి గేమ్‌లో హంపి 69 ఎత్తుల్లో బేలా ఖొటెనాష్విలి (జార్జియా)పై గెలిచింది. జన్సాయా (కజకిస్తాన్)తో రెండో గేమ్‌ను 32 ఎత్తుల్లో... కొస్టెనిక్ (రష్యా)తో మూడో గేమ్‌ను 61 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హంపి... నానా జాగ్‌నిద్జె (జార్జియా)తో జరిగిన నాలుగో గేమ్‌లో 53 ఎత్తుల్లో ఓడిపోయింది. మరోవైపు హారిక తొలి గేమ్‌లో 95 ఎత్తుల్లో కొస్టెనిక్ (రష్యా) చేతిలో ఓడిపోయి... ఎలిజబెత్ (జర్మనీ)తో జరిగిన రెండో గేమ్‌ను 79 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. బేలా (జార్జియా)తో జరిగిన మూడో గేమ్‌లో హారిక 44 ఎత్తుల్లో గెలిచి, అనస్తాసియా (రష్యా)తో జరిగిన నాలుగో గేమ్‌ను 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. హంపి, హారికతోపాటు మరో నలుగురి ఖాతాలోనూ రెండేసి పాయింట్లు ఉన్నా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించారు. -
ఉత్కంఠభరితంగా చదరంగం పోటీలు
భీమవరం : చదరంగంపై ఇటీవల అన్ని వయస్సుల వారిలో ఆసక్తి పెరిగిందని చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట భోగయ్య అన్నారు. భీమవరం అనసూయ చెస్ అకాడమీలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా చదరంగం పోటీల్లో విజేతలకు జ్ఞాపికలను అందచేసిన అనంతరం ఆయన మాట్లాడారు. చెస్‌తో మేథస్సుకు పదును పెడుతుందన్నారు. ఈనాటి విజేతలు జూన్ నెలలో గుంటూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి మహిళా చందరంగం పోటీల్లో పాల్గొంటారన్నారు. అసోసియేషన్ కార కార్యదర్శి మాదాసు కిషోర్ మాట్లాడుతూ ఈ నెల 28న అండర్ 11 జిల్లాస్థాయి బాలబాలికల చదరంగం పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీల్లో విజేతలు కర్నూలులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. మొదటి నాలుగు స్థానాల్లో గెలుపొందిన గ్రంధి సౌమ్యబాల(కాళ్ల), కెఎల్ రోషిణి(ఏలూరు), కామన దివ్య(భీమవరం, గ్రంధి కావ్య(కాళ్ల)లకు మెడల్స్, సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందచేశారు. ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి హరికృష్ణ, అల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఓపెన్ చెస్ చాంప్ కృష్ణ
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన జాతీయ చెస్ ఆటగాడు సీఆర్జీ కృష్ణ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. రామ్‌నగర్‌లోని సూపర్ కిడ్స్ చెస్ అకాడమీలో మంగళవారం జరిగిన ఈ ఈవెంట్లో కృష్ణ అన్ని రౌండ్లలోనూ విజయం సాధించాడు. దీంతో అతను ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. చివరి ఐదో రౌండ్ గేమ్‌లో కృష్ణ... ప్రత్యూష్ శ్రీవాస్తవపై గెలుపొందాడు. రెండో స్థానంలో వీఎస్ఎన్ మూర్తి నిలువగా... ప్రత్యూష్, ప్రవీణ్ భండారిలు వరుసగా మూడు, నాలుగు స్థానాలు పొందారు. విజేతలకు హైదరాబాద్ జిల్లా సంఘం కార్యదర్శి కన్నారెడ్డి మెడల్స్ అందజేశారు. 3న అండర్-7 టోర్నీ సూపర్ కిడ్స్ చెస్ అకాడమీ వచ్చే నెల 3న హైదరాబాద్ జిల్లా సెలక్షన్ చాంపియన్‌షిప్‌ను నిర్వహించనుంది. అండర్-7, మహిళల చాలెంజర్, ఓపెన్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఎంట్రీలు పంపేందుకు మరిన్ని వివరాలకు కె.దయానంద్‌ను 9652617524 ఫోన్నంబర్లో సంప్రదించవచ్చు.