తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి | Vinayaka Chavithi 2024 Celebrations by Telangana Cultural Society Singapore | Sakshi
Sakshi News home page

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి

Published Mon, Sep 9 2024 10:23 AM | Last Updated on Mon, Sep 9 2024 10:41 AM

Vinayaka Chavithi 2024 Celebrations by Telangana Cultural Society Singapore

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో జూమ్ ద్వారా ఉదయం శ్రీ వినాయక చవితి పూజ కార్యక్రమం  ఘనంగా జరిగింది. ఈసందర్భంతగా బాల వినాయక పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.  ఈ  కార్యక్రమంలో భక్తులు కుటుంబ సమేతంగా ప్రత్యక్ష పూజలో పాల్గొని, ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.  ఈ పూజను ఇండియా నుండి  మహబూబ్ నగర్‌కు పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ గారు అంతర్జాలం ద్వారా నిర్వహించారు.

ఈ  సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ  అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి ,కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ  ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త  నల్ల, గోనె  నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి  వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా,  భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి,  విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు , మణికంఠ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

అందరిపై వినాయకుని ఆశీస్సులుgడాలని  ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారికి చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ ,ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మై హోమ్ APAS బిల్డర్స్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, మకుట డెవలపర్స్ , జీ ఆర్ టి అర్ట్లాండ్స్ , లైవ్ స్పేస్ ఇంటీరియర్ & రేనోవేషన్స్ , SVS శ్రీవసుధ ట్రూ వెల్త్ ఇండియా మరియు ఎవోల్వ్ గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement