న్యూఢిల్లీ: హరిత విద్యుత్ శక్తి విభాగంలో స్థానం పటిష్టం చేసుకునే దిశగా సింగపూర్‌కి చెందిన సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో హరిత అమ్మోనియాను ఉత్పత్తి చేసేందుకు జపాన్‌కు చెందిన రెండు సంస్థలతో చేతులు కలిపింది. దీనికి సంబంధించి సోజిజ్ కార్ప్, క్యుషు ఎలక్ట్రిక్ పవర్‌తో తమ అనుబంధ సంస్థ సెంబ్‌కార్ప్ గ్రీన్ హైడ్రోజన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది.
ఈ ఒప్పందం ప్రకారం జపాన్‌కు ఎగుమతి చేసే లక్ష్యంతో భారత్‌లో హరిత అమోనియాను ఉత్పత్తి చేసే అవకాశాలను పరిసీలించనున్నట్లు సెంబ్‌కార్ప్ వివరించింది. 2030 నాటికి జపాన్ 3 మిలియన్ టన్నుల అమోనియాను దిగుమతి చేసుకోనుంది. సోజిజ్ సంస్థ ఎనర్జీ ట్రేడింగ్, పెట్టుబడుల వ్యాపార దిగ్గజం కాగా క్యుషు ఎలక్ట్రిక్ ప్రధానంగా జపాన్‌లోని క్యుషు ప్రాంతానికి విద్యుత్ అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment