
కోదాడ రూరల్: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన యువకుడు సింగపూర్‌లో బీచ్‌కు వెళ్లి నీటి అలలకు కొట్టుకు పోయి మృతిచెందాడు. కోదాడ పట్టణంలోని ఎర్నేని టవర్‌లో నివాసం ఉంటున్న చౌడవరపు శ్రీనివాసరావు, చంద్రకళ దంపతుల రెండో కుమారుడు పవన్ (28) హైదరాబాద్‌లో ఆరేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు.
గతేడాది ఫిబ్రవరి నుంచి సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, పవన్ తన స్నేహితులో కలిసి శుక్రవారం సింగపూర్‌లోని సెన్సోటియా బీచ్‌కు వెళ్లాడు. నీటిలోకి దిగిన పవన్ అక్కడ అలల ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందినట్లు తమకు సమాచారం వచ్చిందని కుటుంబ సభ్యులు తెలి పారు.
శ్రీనివాసరావు పట్టణంలో ఆయిల్ మిల్లు నడుపుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా.. పవన్ రెండో కుమారుడు. పెద్ద కుమారుడు లండన్ లో ఉద్యోగం చేస్తుండగా మూడో కుమారుడు స్థానికంగా ఉంటూ తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. పవన్ కొద్ది రోజుల్లోనే సింగపూర్ నుంచి అమెరికాకు వెళ్లాల్సి ఉందని బంధువులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment