వాటి విలువ రూ.1.5 లక్షల కోట్లు ఉంటుంది
ప్రభుత్వ, ఇనాం, పడావు భూములు చేతులు మారాయి
వీటికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తాం
మీడియాతో చిట్‌చాట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: ధరణి ముసుగులో విలువైన ప్రభుత్వ, ఇనాం, పడావు, ఎవాక్యుయీ భూములు వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని ప్రభుత్వం గుర్తించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అన్యాక్రాంతమైన ఈ భూములను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దాదాపు పదిహేను వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని, చేతులు మారాయని తేలిందని.. కనిష్టంగా ఒక ఎకరా రూ.10 కోట్లు అని అనుకున్నా వీటి విలువ దాదాపు రూ.1.5 లక్షల కోట్లు ఉంటుందని చెప్పారు. బుధవారం శాసనసభలోని తన కార్యాలయంలో భట్టి మీడియాతో ముచ్చటించారు.
10 వేల ఎకరాలు ధారాదత్తం చేశారు
‘అన్యాక్రాంతమైన భూములే కాకుండా అస్సైన్డ్ భూములను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే.. మళ్లీ ప్రభుత్వ అవసరాల కోసమే వినియోగించాలి. కానీ ఇబ్రహీంపట్నం మండలంలో పది వేల ఎకరాలను ధారాదత్తం చేశారు. గతంలో భూముల రిజి్రస్టేషన్ అనంతరం రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ భూముల మ్యుటేషన్ జరిగి పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చేవి. కానీ ధరణి వచి్చన తర్వాత రిజి్రస్టేషన్ కాగానే వెంటనే మ్యుటేషన్ అవడం, ధరణి పోర్టల్‌లో వేలిముద్రలు, ఫోటో రాగానే.. అక్కడికక్కడే ఇతరులకు విక్రయించడం వల్ల అసలు ఆ భూముల చరిత్ర తెలియకుండానే క్రయ విక్రయాలు, మ్యుటేషన్లు జరిగిపోయాయి.
ఇనాం, పడావు, ఎవాక్యుయీ ప్రాపర్టీ, ప్రభుత్వ భూములను ధరణిలో ఎంట్రీ చేసే సమయంలోనే పేర్లు మారిపోయాయి. ఒకసారి ధరిణిలో ఎంటర్ అయ్యాక వాటిని మార్చే అవకాశం లేకుండా పోయింది. కొన్నింటిని కావాలనే పార్ట్ ‘బీ’లో చేర్చారు. దీనిని అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున భూములు చేతులు మారాయి. ధరణిలో ఒక్క భూ యజమాని పేరు మినహా కాస్తుదారులు/ అనుభవదారుల కాలమ్ లేకపోవడంతో ఇష్టానుసారం భూములు చేతులు మారాయి..’అని డిప్యూటీ సీఎం చెప్పారు.
పార్ట్ ‘బీ’భూముల్లోనే పెద్దయెత్తున దందా
‘ధరణికి ముందున్న రికార్డులను, ధరణిలోకి వచ్చిన తరువాత మారిన భూముల వివరాలను పరిశీలిస్తాం. పూర్తిస్థాయిలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. భూములు మూడు, నాలుగు చేతులు మారినా..అవి ఫ్రభుత్వానికి చెందిన భూములు అని తేలితే స్వాధీనం చేసుకుంటాం. ప్రధానంగా పార్ట్ ‘బీ’కింద పెట్టిన భూముల్లోనే ఈ దందా పెద్ద ఎత్తున సాగింది..’అని భట్టి అన్నారు.
కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసా తెస్తాం
మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధులు ప్రతి పైసా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. కేంద్రం రాష్ట్రాల వారీగా నిధులు కేటాయించదని, పథకాల వారీగా చేయాల్సిన ఖర్చునకు అనుగుణంగా కేటాయింపులు జరుపుతుందని అన్నారు. బుధవారం శా సనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కవిత, దయానంద్ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు భట్టి సమాధానం చెప్పారు.
గత పదేళ్ల నుంచి కేంద్ర ప్ర భుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, ఏడా ది కాలంగా వచి్చన నిధులకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం సభముందు ఉంచామని తెలిపారు. కేవలం ఏడాదిలో పదేళ్లలో సాధించిన దానికంటే మించి పురోగతి సాధించామని భట్టి పేర్కొన్నా రు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రత్యేకంగా పథకాలు రూపొందించాల్సిందిగా సంబంధిత కార్పొరేషన్‌ను ఆదేశించామన్నారు.
2026 డిసెంబర్ నాటికి ‘పాలమూరు’ పూర్తి: మంత్రి ఉత్తమ్
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగిందని, దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. కొడంగల్–నారాయణపేట ప్రాజెక్టు కొత్తదేమీ కాదని, ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలు వచ్చాయని వెల్లడించారు.
అర్చకుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ధూపదీప నైవేద్యం కోసం నెల కు రూ.4 వేలు, గౌరవ వేతనం కింద రూ.6 వేలు చొప్పున మొత్తం రూ.10 వే లు ఇస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ పరిషత్‌ను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసు కొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామ న్నారు. యాదగిరిగుట్టలో టీటీడీ స్థాయి లో పాలకమండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.
పలు బిల్లులకు ఆమోదం
మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) పేరు పెడుతూ మండలిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బిల్లు ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. ది యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ బిల్లుతో పాటు తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లు, తెలంగాణ గూడ్స్ అండ్ సరీ్వస్ ట్యాక్స్ సవరణ బిల్లులను సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment