'ఊ.. గుడ్లు ఉడకబెట్టడం వచ్చు'
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ శనివారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చట్లు పెట్టారు. తన లేటెస్ట్ మూవీ 'బ్రూస్ లీ' విశేషాలతోపాటు అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. వాటిలో కొన్ని మీ కోసం..
అభిమాని : మీ రోల్ మోడల్ ఎవరు?
రకుల్ : మా నాన్నగారు
అభిమాని : మీ నిక్ నేమ్?
రకుల్ : అకు
అభిమాని : మెగాస్టార్ తో మీ ఎక్స్పీరియన్స్ ?
రకుల్ : కల నిజమైంది
అభిమాని : బాహుబలి కాకుండా తెలుగులో మీ ఫేవరెట్ మూవీ?
రకుల్ : నువ్వొస్తానంటే నేనొద్దంటానా
అభిమాని : సెలబ్రిటీల్లో మీ క్రష్?
రకుల్ : రణ్వీర్ సింగ్, తను నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ కూడా
అభిమాని : రణ్వీర్ సింగ్తో నటించే అవకాశం వస్తే ఎలా ఫీలవుతారు?
రకుల్ : కళ్లు తిరిగి పడిపోతా...
అభిమాని : మీకు కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారు ?
రకుల్ : చాలా పొడుగ్గా.. నేను 4 అంగుళాల హీల్ వేసుకున్నా కూడా నాకంటే పొడుగ్గా కనిపించాలి
అభిమాని : 'బ్రూస్ లీ' కి సంబంధించి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ ?
రకుల్ : చిరంజీవి గారి నుంచి.. లే చలో పాటలో చాలా బాగున్నానని
అభిమాని : మీకు ఏదైనా సూపర్ పవర్ని ఎంచుకునే అవకాశం వస్తే దేన్ని సెలక్ట్ చేసుకుంటారు ?
రకుల్ : ఎదుటివాళ్ల మనసు చదివే శక్తిని
అభిమాని : మీ ఫేవరెట్ క్రికెటర్ ?
రకుల్ : విరాట్ కోహ్లి
అభిమాని : మీ ఫేవరెట్ డైరక్టర్ ?
రకుల్ : రాజమౌళి సార్
అభిమాని : హీరోయిన్స్లో ఎవరిని మీరు కాంపిటీషన్గా భావిస్తున్నారు ?
రకుల్ : నాకు నేనే పెద్ద కాంపిటీషన్. ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర నేర్సుకోవాల్సినవి చాలా ఉన్నాయి.
అభిమాని : మీ ఫేవరేట్ హాలి డే స్పాట్ ?
రకుల్ : ఢిల్లీలో ఉన్న మా ఇల్లు
అభిమాని : మీకు బాగా నచ్చిన, స్ఫూర్తినిచ్చిన నటి ఎవరు?
రకుల్ : కాజోల్
అభిమాని : మీరు అందుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ?
రకుల్ : ఐదు వేలు.. ఫస్ట్ ఫొటో షూట్కి
అభిమాని : దక్షిణాది వంటకాల్లో మీకు నచ్చిన ఫుడ్ ?
రకుల్ : ఉలవచారు, రాజు గారి కోడి పలావ్
అభిమాని : మీకు వంట చేయడం వచ్చా ?
రకుల్ : ఊ.. గుడ్లు ఉడకబెట్టడం వచ్చు.