
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు బీజేపీతో తమ పార్టీ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో ప్రయాణం ఒక యాక్సిడెంట్ లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ‘రాజమండ్రి వెళ్లాలని కారులో వెళతాం. దారిలో యాక్సిడెంట్ అవుతుంది. అంతమాత్రాన ప్రయాణం తప్పు అసలేం కదా. బీజేపీతో పొత్తు కూడా అలాంటిదే’ అని ఆయన సమర్థించుకున్నారు.
టీడీపీ-బీజేపీ నాలుగేళ్లు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారం పంచుకున్న సంగతి తెలిసిందే. బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసిన టీడీపీ.. ఆ తర్వాత ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కమలానికి కటీఫ్ చెప్పేసింది. మొదట కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఓకే అంటూ ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు.. నాలుగేళ్ల పాలనలో వైఫల్యాలు.. ప్రజల్లో వ్యతిరేకత నేపథ్యంతో బీజేపీతో తెగదెంపులు చేసుకొని.. హోదా నినాదాన్ని ఎత్తుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment