విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు రూ.12వందల కోట్లు రావాల్సి ఉందని ఆర్థిక మంత్రి యనమల తెలిపారు. అయితే తాము అడిగిన దానికి, కేంద్రం చెబుతున్న లెక్కలకు తేడా ఉందని ఆయన బుధవారమిక్కడ అన్నారు. అందువల్లే రూ.7వేల కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని యనమల తెలిపారు.
జనవరి 31 వరకూ అసెంబ్లీ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారని, ఫిబ్రవరి 20 తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సకాలంలో నిధులు విడుదల చేశామన్నారు. రెండంకెల వృద్ధి సాధనలో విజయం సాధించామని, పేదరిక నిర్మూలనే తమ ప్రభుత్వ లక్ష్యమని యనమల తెలిపారు.