ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలకు ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులతోనే సరిపెట్టింది. రుణమాఫీకి మొండిచేయి చూపించి కేవలం 3600 కోట్లు కేటాయించింది. నిరుద్యోగ భృతిపై యువత పెట్టుకున్న ఆశలను ప్రభుత్వం మరోసారి వమ్ము చేసింది. నిరుద్యోగ భృతి అని కాకుండా.. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం పేరుతో కేవలం రూ. 500 కోట్లు కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది