
సాక్షి, అమరావతి : ఐటీలో రాబోయే సంవత్సరాల్లో లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఏపీని ఐటీ హబ్‌గా మారుస్తామని గొప్పలు చెబుతున్న ఏపీ సర్కార్ బడ్జెట్‌లో మాత్రం నామమాత్రపు నిధులతో సరిపెట్టింది. మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న క్రమంలో ఐటీకి భారీగా కేటాయింపులు చేపట్టాల్సిన క్రమంలో కేవలం రూ 1007 కోట్లను కేటాయించింది. గత ఏడాది అత్యల్పంగా రూ 364 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో మూడురెట్లు పెంచినట్టు ఆర్భాటంగా ప్రకటించింది.
ఐటీ రంగానికి ఊతమిచ్చే స్టార్టప్‌లకు రూ 100 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. అమరావతి వెలుపల విశాఖ, అనంతపురం సహా పలు ప్రాంతాల్లో ఐటీని అభివృద్ధి చేయాల్సిన క్రమంలో బడ్జెట్‌లో ఈ రంగానికి జరిపిన కేటాయింపులు నిరుత్సాహంగా ఉన్నాయనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment