
సాక్షి, విజయవాడ: దివంగత నేత ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడించింది టీడీపీ నేతలేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేశ్ మండిపడ్డారు. చంద్రబాబు వెనుకనుంచి వెన్నుపోటు పొడిస్తే.. యనమల రామకృష్ణుడు ముందునుంచి ఎన్టీఆర్‌ను పొడిచారని దుయ్యబట్టారు.
యనమల నోటిని ఫినాయిల్‌తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. గతంలో స్పీకర్ కుర్చీకే ఆయన తీరని మచ్చ తెచ్చారని విమర్శించారు. విజయవాడలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలతో ఆనాడు ఎన్టీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉన్నారని, అందుకే ఎన్టీఆర్ చూపిన బాటలోనే అనైతిక రాజకీయాలకు వ్యతిరేకంగా తామూ నడుస్తామని చెప్పామని జోగి రమేశ్ అన్నారు.