రుణమాఫీని ఒకేసారి విడుదల చేయాలి | loan subsidy release at one time | Sakshi
Sakshi News home page

రుణమాఫీని ఒకేసారి విడుదల చేయాలి

Published Sat, Aug 20 2016 10:00 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

రుణమాఫీని ఒకేసారి విడుదల చేయాలి - Sakshi

రుణమాఫీని ఒకేసారి విడుదల చేయాలి

చౌటుప్పల్‌ : మూడు, నాలుగో విడత రుణ మాఫీని ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 26న కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌లో శనివారం జరిగిన సీపీఎం సమావేశంలో మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో.. కౌలుదారులకు గుర్తింపుకార్డులు, రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు. కలెక్టరేట్‌ ముట్టడికి రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం, డివిజన్‌ కార్యదర్శి చింతల భూపాల్‌రెడ్డి, దోనూరి నర్సిరెడ్డి, రొడ్డ అంజయ్య, పాషా, కీసరి నర్సిరెడ్డి, మండల నాయకులు ఆకుల ధర్మయ్య, ఆనగంటి వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement