ఆదర్శవంతంగా జీవించాలి | To live ideality | Sakshi
Sakshi News home page

ఆదర్శవంతంగా జీవించాలి

Published Sat, Aug 27 2016 11:01 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

ఆదర్శవంతంగా జీవించాలి - Sakshi

ఆదర్శవంతంగా జీవించాలి

చౌటుప్పల్‌ : ఆదర్శ వివాహం చేసుకున్న వధూవరులు ఆదర్శవంతంగా జీవించాలని సీపీఎం డివిజన్‌ కార్యదర్శి చింతల భూపాల్‌రెడ్డి సూచించారు. చౌటుప్పల్‌లో సీపీఎం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా రాష్ట్రంలోని మల్కానిగిరి జిల్లా సిమిలిబంచా గ్రామానికి చెందిన కుర్మి గంగ, ఒడి భీమలకు ఆదర్శ వివాహం చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మంచి జీవితాన్ని గడపాలన్నారు.  కార్యక్రమంలో  నాయకులు రొడ్డ అంజయ్య, ఎండీ.పాషా, బత్తుల శ్రీశైలం, దండ అరుణ్‌కుమార్, గోశిక కర్ణాకర్, ఆకుల ధర్మయ్య, ఆనగంటి వెంకటేష్, రాగీరు కిష్టయ్య, చెర్కు జంగయ్య, బత్తుల దాసు, నర్సిరెడ్డి, జయమ్మ, విజయలక్ష్మీ, యాదమ్మ, నర్సమ్మ, అండాలు తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement