రుణమాఫీ ఒకేసారి చేయాలి
రుణమాఫీ ఒకేసారి చేయాలి
Published Tue, Aug 2 2016 10:39 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
దోమలపల్లి (నల్లగొండ రూరల్)
ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ మండలంలోని దోమలపల్లిలో సంఘ బంధం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం దోమలపల్లి – అప్పాజీపేట గ్రామాల మధ్య రోడ్డు పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రుణం లభించక రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని ఫలితంగా వారిపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీని చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాదిలోగా బి.వెల్లెంల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు నీరు అందించడమే తన లక్ష్యమన్నారు. ఈ ప్రాంత రైతుల బీడు భూములకు సాగు నీరు అందించి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతానన్నారు. అన్ని గ్రామాల లింకు రోడ్డులను క్రమంగా బీటీ రోడ్డులుగా మారుస్తామన్నారు. గ్రామ జ్యోతికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, గుమ్మల మోహన్‌రెడ్డి, గాదె లక్ష్మి, వెంకట్‌రెడ్డి, యాదయ్య, రవీందర్, సతీష్, ఉమాదేవి, ఎంపీడీఓ సత్తెమ్మ, సీసీ యాదమ్మ, ఏఈ రాములు తదితరులు పాల్గొన్నారు.
Advertisement