మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత
Published Fri, Aug 26 2016 11:03 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ రూరల్ : మండలంలోని దోమలపల్లి జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం తిన్న పలువురు విద్యార్థులు శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు, హైస్కూల్ హెడ్మాస్టర్ ప్రమీల తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్న భోజనం తిన్న తరువాత 4గంటలకు 13 మంది విద్యార్థులు వాంతులు కావడంతో మునుగోడులోని ఓ వైద్యుడి దగ్గర తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే ఇందులో కొండారం గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి కావ్యశ్రీ, 7వ తరగతి విద్యార్థి హరికృష్ణలకు కడుపునొప్పి లేస్తుందని చెప్పడంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
అసలేం జరిగింది ?
మధ్యాహ్న భోజనం తిన్న తరువాత విద్యార్థులు కాసేపు ఆడుకున్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోతగా ఉండటంతోపాటు ఫుడ్‌పాయిజన్‌కు గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. 4గంటలకు ఒకరు తరువాత ఒకరు 13 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉపాధ్యాయులంతా ఆందోళన గురై వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement