గుంటూరు జిల్లా కాకమానులో రుణమాఫీ విషయంలో జాప్యం ప్రదర్శించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు(కాకమాను): గుంటూరు జిల్లా కాకమానులో రుణమాఫీ విషయంలో జాప్యం ప్రదర్శించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌బీఐ కాకమాను బ్రాంచ్ మేనేజర్ రుణమాఫీ విషయంలో సరిగా స్పందించడం లేదని బ్యాంకుకు సోమవారం తాళాలు వేసి నిరసన తెలియజేశారు. దాదాపు 20 నిమిషాలు పాటు తాళాలు వేసిన రైతులు బ్యాంకు ఎదుటు మేనేజర్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.