తమకు గుర్తింపు కల్పించాలని, రుణాలు మాఫీ చేసి కొత్తగా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురంలో కౌలు రైతులు ఆందోళనకు దిగారు.
పార్వతీపురం: తమకు గుర్తింపు కల్పించాలని, రుణాలు మాఫీ చేసి కొత్తగా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురంలో కౌలు రైతులు ఆందోళనకు దిగారు. పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం కౌలు రైతులు ఆందోళన ప్రారంభించారు. తమకు వ్యవసాయ రుణాలు ఇవ్వడంలేదని అధికారులు వెంటనే స్పందించి కౌలు రైతులకు గుర్తింపు ఇవ్వడంతో పాటు రుణాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.