సారంగాపూర్: నెల్లూరు జిల్లా సారంగాపూర్ మండలంలోని జామ్ సబ్‌స్టేషన్ పరిధిలో గత వారం రోజులుగా గ్రామానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయకపోవడంపై ఆగ్రహించిన రైతులు మంగళవారం స్థానిక సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత వారంరోజులుగా తమకు విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పొట్ట దశలో ఉన్న వరిపంట, పత్తి, పసుపు పంటలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ సరఫరాలో వారంరోజలుగా అంతరాయం ఏర్పడిందని ఆరోపించారు.
లైన్‌లో సమస్యలున్నా వాటిని గుర్తించక వారం రోజుల పాటు తాత్సారం చేశారని దాని ఫలితంగా పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే ట్రాన్స్‌కో ఏఈ దేవరావు సబ్‌స్టేషన్‌కు చేరుకుని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అంతకు ముందు రైతులు ట్రాన్స్‌కో ఏడీకి సమస్యను ఫోన్‌ద్వారా వివరించారు. అయితే ఆయన స్పందించి వెంటనే సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.