ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ మహిళలు ఆందోళనకు దిగారు.
దండేపల్లి(ఆదిలాబాద్): ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ మహిళలు ఆందోళనకు దిగారు. ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) గ్రూపు మహిళలు సుమారు 100 మంది శుక్రవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలోని బస్టాండ్ వద్ద రాస్తారోకోకు పూనుకున్నారు. వెంటనే ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కారణంగా రోడ్డుకు రెండు వైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.