
విద్యార్థుల రాస్తారోకో..10 మంది అరెస్ట్
కళాశాలల్లో ఫీజులు తగ్గించాలంటూ విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
బొబ్బిలి: కళాశాలల్లో ఫీజులు తగ్గించాలంటూ విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఉదయం రాస్తారోకో చేయడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అయితే, ఆందోళన నిర్వహణకు సంబంధించి ముందుగా అనుమతి తీసుకోలేదంటూ పోలీసులు పది మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు.