అచ్చంపేటలో రాస్తారోకో | students rastaroko in mahabub nagar | Sakshi
Sakshi News home page

అచ్చంపేటలో రాస్తారోకో

Published Thu, Aug 6 2015 1:11 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

students rastaroko in mahabub nagar

అచ్చంపేట : గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థి మృతికి నిరసనగా.. విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష నాయకులు ధర్నాకు దిగారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గురువారం జరిగింది. విద్యార్థి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని.. మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరుతూ.. రాస్తారోకో నిర్వహించారు. దీంతో రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లింగాల గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రాము(16) అనే విద్యార్థి బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై అతని తల్లిదండ్రులు తమ కొడుకుది ఆత్మహత్య కాదని ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement