
హైదరాబాద్ నిమ్స్‌లో భూమా నాగిరెడ్డి
* ఛాతీలో నొప్పి రావడంతో కర్నూలుకు తరలించిన పోలీసులు
* వైద్యుల సూచన మేరకు నిమ్స్‌కు తరలింపు
హైదరాబాద్/కర్నూలు: టీడీపీ నేతలు బనాయించిన అక్రమ కేసులో అరెస్టయిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ పాత భవనం ఐసీపీయూ బెడ్ నెంబర్ 6లో అడ్మిట్ చేశా రు. వైద్యులు ఆయన ఛాతీని ఎక్స్‌రే తీశారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో గొడవ కేసులో భూమాను స్థానిక పోలీసులు ఈనెల ఒకటిన అరెస్ట్ చేశారు. రిమాం డ్‌లో ఉన్న ఆయనను వెంటనే వైద్యం కోసం స్థానిక మెడికేర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు మంగళవారం ఛాతీలో నొప్పి రావడంతో పోలీసులు మధ్యాహ్నం 3.25 గంటలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. గుండె వ్యాధుల చికిత్స విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయిం చారు. ఇదే విషయాన్ని పోలీసు అధికారులకు వివరించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి వైద్యులతో మాట్లాడారు. సాయంత్రం 6.20 గంటలకు కార్డియాలజీ ఐసీసీయూ విభాగం నుంచి వీల్‌చైర్‌లో బయటికి వచ్చిన భూమానాగిరెడ్డిని అంబులెన్స్‌లో పోలీసు ఎస్కార్ట్‌తో హైదరాబాద్‌కు తరలించారు.