
చంద్రబాబును ప్రజలు క్షమించరు: భూమా
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ప్రజలు క్షమించబోరని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ప్రజలు క్షమించబోరని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. గురువారం ఉదయం కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 25 నుంచి నిర్వహించే బస్సు యాత్రకు ముందు తాను ఏ ప్రాంతానికి అనుకూలమో చంద్రబాబు వివరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణనో, సీమాంధ్రనో తేల్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజలు యాత్రను అడ్డుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర విభజనపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంపాదకులు, మేధావులతోను సంప్రదింపులు జరుపుతున్నానని బాబు ప్రకటించారని, అయితే లేఖ ఇచ్చే ముందు ఎందుకు చర్చించలేదని ఆయన ప్రశ్నించారు. సమస్య నుంచి తప్పించుకోవడానికే మేధావుల సదస్సులు, బస్సు యాత్రలు చేస్తున్నారని భూమా ఆరోపించారు.